థియేటర్స్‌‌లో రిలీజ్ కాకముందే ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్, కామెడీ మూవీ!

by Jakkula Samataha |
థియేటర్స్‌‌లో రిలీజ్ కాకముందే ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్, కామెడీ మూవీ!
X

దిశ, సినిమా : సంజయ్ దత్, రవీనా టాండన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ఘడ్ ఛడీ. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఘడ్ ఛడీ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందని చాలా మంది అనుకున్నారు కానీ అతి త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది.

రవీనా టాండన్‌, సంజయ్ దత్ కీల పాత్రల్లో, భార్య భర్తలుగా కనిపించిన ఈ సినిమాను మూవీ టీం థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. 2022లోనే మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జియో సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. రొమాంటిక్ కామెడీ కథతో రూపొందిన ఈ సినిమా, ఆగస్టు 9న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు జియో సినిమా అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 9న తెలుగు , తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను క్రిషన్కుమార్, భూష్ టీ సిరీస్ పతాకంపై నిర్మించగా, ఇందులో సంజయ్ దత్, రవీనా, పార్థ్ సమతాన్,కుషాలీ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story