ఎవరితోనైనా కమిట్ అయ్యావా అని నెటిజన్ ప్రశ్న.. శ్రీలీల సమాధానమేంటో తెలిస్తే షాక్!

by Hamsa |   ( Updated:2023-11-12 07:18:06.0  )
ఎవరితోనైనా కమిట్ అయ్యావా అని నెటిజన్ ప్రశ్న.. శ్రీలీల సమాధానమేంటో తెలిస్తే షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ ధమాకా మూవీతో హిట్ అందుకుని ఓవర్ నైట్‌ స్టార్‌గా మారిపోయింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, వంటి స్టార్ హీరోల చిత్రాల్లో అమ్మడు నటించనుంది.

అలాగే శ్రీలీల చేతిలో ప్రస్తుతం పది సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇటీవల బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అలాగే భారీగా పాపులారిటీ పెరిగింది. తాజాగా, శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. నన్ను ప్రశ్నలు అడగండి అని తెలిపింది. అందులో రకరకాల ప్రశ్నలు అడిగారు. ఓ నెటిజన్ ఈ రోజు బిగ్‌బాస్ ఫోకు వస్తున్నారా? అని అడగ్గా.. అవును ఆదికేశవ ప్రమోషన్స్ కోసం అని ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత నువ్వు కమిట్ అయ్యావా? అనగా.. అవును నేను నా వర్క్‌తో కమిట్ అయ్యాను అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చెప్పిన ఆన్సర్లు నెట్టింట వైరల్‌గా మారాయి.







Advertisement

Next Story