- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Janaka Aithe Ganaka: జీవితాంతం గుర్తుండే సినిమా!

దిశ, సినిమా: సుహాస్, సంకీర్తన జంటగా నటిస్తున్న చిత్రం 'జనక అయితే గనక'. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెప్టెంబర్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 19న సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి 'నా ఫేవరేట్ నా పెళ్లాం' సాంగ్ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆసక్తికరమైన కాన్సెప్ట్తో రూపొందుతున్న చిత్రమిది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించినప్పుడు మంచి కిక్ వస్తుంది. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి పెళ్లి చేసుకుని తనకొచ్చిన జీతంతో జీవితాన్ని ఎటువంటి బాదర బందీ లేకుండా గడుపుతుంటాడు. అతను పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. ఎందుకు పిల్లలను వద్దనుకుంటున్నావని ఎవరైనా అడిగితే అందరికీ లెక్కలు చెప్పి నోరుమూయిస్తుంటాడు. ఇలాంటి ఓ ఎంటర్టైనర్ని చూపించబోతున్నాం’’ అని అన్నారు.