'అల్లంత దూరాన' సబ్జెక్టును నమ్ముకుని తీసిన మూవీ బిగ్‌ హిట్ అవుతుంది: అలీ

by Vinod kumar |
అల్లంత దూరాన సబ్జెక్టును నమ్ముకుని తీసిన మూవీ బిగ్‌ హిట్ అవుతుంది: అలీ
X

దిశ, సినిమా: విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా 'అల్లంత దూరాన'. చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన సినిమాను.. ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడిన ప్రముఖ హాస్యనటుడు, ఎ.పి. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ.. సబ్జెక్టును నమ్ముకుని, అందుకు తగ్గ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ ఫీస్ట్‌గా తీసిన సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్నాడు.

అలాగే డి.ఎస్.రావు మాట్లాడుతూ 'ఈ సినిమా టీజర్ చూడగానే కళాతపస్వి కె.విశ్వనాథ్, ఆయన తీసిన సినిమాలు గుర్తుకొచ్చాయి. ఎంతో కష్టపడి తీసిన ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అన్నారు. చివరగా ఒక మంచి ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో తెరకెక్కించిన మూవీ అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం తెలిపింది.

Advertisement

Next Story