పెళ్లి చేసుకున్న బుల్లితెర హీరో.. దాన్ని సస్పెన్స్‌గా ఉంచడంతో నెట్టింట మిస్టరీగా మారిన వీడియో

by Disha Web Desk 6 |
పెళ్లి చేసుకున్న బుల్లితెర హీరో.. దాన్ని సస్పెన్స్‌గా ఉంచడంతో నెట్టింట మిస్టరీగా మారిన వీడియో
X

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీల్లో చాలా మంది పెళ్లి చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్స్‌తో పాటు బెల్లితెర నటీనటులు కూడా వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం తమ పెళ్లి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ సీక్రెట్‌‌గా ఉంచుతున్నారు. అయినప్పటికీ కొంత మంది వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తూ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా, బుల్లితెర హీరో ఆకర్ష్ బైరమూడి పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు సీరియల్స్ స్టార్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన వీడియోను యూట్యూబర్ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేయడం అది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వీడియోలో పెళ్లి కూతురు ముఖం కనిపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. దీంతో అది చూసిన వారంతా ఆకర్ష్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కానీ అందులో కాలు మాత్రమే కనిపించడంతో వధువు ఎవరో గుర్తుపట్టే చాన్స్ లేకపోవడంతో వీడియో మిస్టరీగా మారిపోయింది. దీంతో అతని భార్య ఎవరా? అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. కాగా.. ఆకర్ష్ తెలుగు, కన్నడలో లపు సీరియల్స్ చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో పున్నాగ, అత్తారింట్లో చెల్లెళ్ళు, మామగారు వంటి సీరియల్స్ చేశాడు. అలాగే పలు షోస్‌లో హాజరై నటి రోహిణితో జోడిగా టాస్కుల్లో పాల్గొన్నాడు. జనాలను నవ్వించేందుకు రోహిణి, ఆకర్స్ స్టేజ్‌పై తమ కామెడీతో అదరగొట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed