Samantha: ఉన్నత శక్తి మిమ్మల్ని చూస్తోంది.. నువ్వు ఒంటరివి కావు మేమున్నాం.. వినేష్‌కి సపోర్ట్‌గా సమంత పోస్ట్

by Hamsa |
Samantha: ఉన్నత శక్తి మిమ్మల్ని చూస్తోంది.. నువ్వు ఒంటరివి కావు మేమున్నాం.. వినేష్‌కి సపోర్ట్‌గా సమంత పోస్ట్
X

దిశ, సినిమా: అనుకోని పరిస్థితుల కారణంగా పారిస్ ఒలంపిక్స్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 50 కేజీల కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా వినేష్ ఫోగట్ మీద అనర్హత వేటు పడింది. ఇక ఈ వార్త విన్న యావత్ భారత అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో.. పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటిలు వినేష్‌కు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. అలాగే కొంతమంది వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వినేష్‌కు సపోర్ట్‌గా ఓ పోస్ట్ పెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ‘‘అత్యంత శక్తివంతులకే కాలం కఠినమైన సమస్యలు తెస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు ఒంటిరివి కాదు.ఉన్నత శక్తి మిమ్మల్ని చూస్తోంది. కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే మీ అద్భుతమైన సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం. మీ ఎత్తులు, పతనాలన్నింటిలో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాము’’ అని రాసుకొచ్చింది. అలాగే వినేష్ ఫొటో కూడా షేర్ చేసింది. ఇక సామ్ పోస్ట్ చూసిన వారు హార్ట్ బ్రేక్ అయిందంటూ వినేష్‌కు అన్యాయం జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. అలాగే నువ్వు బెస్ట్ అని సమంతను పొగుడుతున్నారు.

(Video Link Credits to samantharuthprabhu Instagram Channel)

Advertisement

Next Story