- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇల్లు కట్టుకునే ప్రతి ఇటుకపై ఎన్టీఆర్ పేరు.. ఇదెక్కడి అభిమానం రా బాబు...
దిశ, సినిమా: మామూలుగా హీరోహీరోయిన్లపై అభిమానాన్ని చాటుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఫ్యాన్స్. పెద్ద పెద్ద బ్యానర్లు, విగ్రహాలు, కటౌట్లు పెట్టించడం, ఇంకొందరైతే గుడి కట్టించడం చేస్తుంటారు. అయితే తాజాగా తారక్ అభిమాని మాత్రం ఊహించని విధంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్.. ప్రతి ఇటుక మీద NTR అనే పేరు వచ్చేలా తయారు చేయించాడు. బట్టీ కార్మికులకు చెప్పి ఎన్టీఆర్ పేరు అచ్చుతో ఇటుకలను తయారు చేయించుకున్నాడు. తన ఇంటికి వాడిన ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ పేరు ఉండాలని కోరుకుని ప్లాన్ చేసి మరీ కట్టించుకున్నాడు.
అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఎన్టీఆర్ అంటే ఇంత ప్రేమ, ఆరాధన ఉంటుందంటూ.. ఆ అభిమానిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మిగతా అభిమానులు. ‘నువ్వు సూపర్.. కేక బ్రో’ అంటూ పొగిడేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.