- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి ఫోన్, ఫేస్‌బుక్ నిండా అశ్లీల సందేశాలే.. అతడే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకుని.. తర్వాత నచ్చక విడిపోయిన జంటలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు బుల్లితెర నటి మహాలక్ష్మి, నటుడు దినేష్. బెంగళూరుకు చెందిన రచిత మహాలక్ష్మి కన్నడ, తమిళ టీవి సీరియల్స్‌లో బాగా పాపులారిటీ ఉన్న నటి. అంతే కాకుండా బిగ్ బాస్-6 సీజన్‌కు పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుని బాగా ఫేమస్ అయింది. ఈమె 2015 లో బుల్లితెర నటుడైన దినేష్ గోపాల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే ఇప్పటివరకు ఈ జంట విడాలకులైతే తీసుకోలేదు కానీ ఎవరి లైఫ్ వాళ్లది అన్నట్లుగా జీవిస్తున్నారు.
ఇక.. మహాలక్ష్మి బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు తన భర్తతో విడిపోయిన విషయాన్ని వెల్లడించింది. కానీ, దినేష్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ మధ్య మనస్పర్థలు తొలగిపోతాయని, ఇద్దరం కలిసి జీవించే రోజులు వస్తాయని తెలిపాడు. ఇదిలా ఉంటే.. జూన్ 21 అర్ధరాత్రి రచిత మహాలక్ష్మి దినేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడిపోయినప్పటికీ దినేష్ తనకు అసభ్యకరమైన, అశ్లీలమైన సందేశాలు పంపిస్తున్నాడని, వాట్సాప్‌లో, ఫేస్ బుక్‌లో అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ నిమిత్తం.. దినేష్‌ను పోలీసులు పిలిపించగా ఆమె తనపై తప్పుడు నిందలు మోపుతుందని తెలిపాడట. అయితే.. దినేష్‌తో విడాకులు సిద్ధం కావాలని పోలీసులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
Read More... Vicky Kaushal: యంగ్ హీరోకు అంగస్తంభన సమస్య.. అసంతృప్తితో తరుచూ గొడవ పడుతున్న భార్య