చియాన్ విక్రమ్ 'తంగలాన్' నుంచి పిచ్చెక్కించే అప్ డేట్...

by Shiva |   ( Updated:2023-06-27 17:34:08.0  )
చియాన్ విక్రమ్ తంగలాన్ నుంచి పిచ్చెక్కించే అప్ డేట్...
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరో విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'తంగలాన్'. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో చిత్ర ప్రధాన తారాగణంతో కూడిన ఒక కీలక షెడ్యూల్‌ను మూవీ టీం ముగించింది. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్ డ్రామా చివరి షెడ్యూల్ బుధవారం నుంచి మధురైలో కొనసాగనుంది. 'తంగలాన్' 3D ఫార్మాట్‌లో కూడా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం. ఈ బిగ్ ఎంటర్ టైనర్ లో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి, తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. జీ.వీ.జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా, నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

Advertisement

Next Story