OTT movie: ఓటీటీలో బోల్డ్ మూవీ.. ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్లపై తిరిగే జంట.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Kavitha |
OTT movie: ఓటీటీలో బోల్డ్ మూవీ.. ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్లపై తిరిగే జంట.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో విడుదలైన 20 నుంచి 25 రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి జనాలు కూడా థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడటానికి అంత ఇష్టపడట్లేదు. అయితే వీటిలో ఉండే మూవీస్ కూడా వివిధ జోనర్లలో ఉంటాయి. అందులో సస్పెన్స్, హారర్, ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్, సోషల్ ఇన్స్పైర్, మోస్ట్ డిస్ట్రబెన్స్, రొమాంటిక్ మూవీ అంటూ పలు రకాల జోనర్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొందరికి రొటీన్ లైఫ్ కాకుండా ఎలా కావాలంటే అలా బ్రతికితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మరి అలాంటి వారి కోసమే ఈ సినిమా. ఈ క్రేజీ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దామా.. ఈ మూవీ ఓటిటీలో కాకుండా ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక అసలు విషయానికొస్తే ఈ మూవీ పేరు ‘మండే’. అయితే టైటిల్లో ఉన్నట్టుగానే ఈ మూవీ బోల్డ్‌గా ఉంటుంది. కాబట్టి సోలో వాచింగ్ సో బెటర్ అనే విషయం మర్చిపోకండి.

ఇక కథ విషయానికి వస్తే..

ఓ జంట తప్ప తాగేసి ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు హగ్ చేసుకుని మరీ బీచ్‌లో పడుకుంటారు. ఈ వింత సీన్ చూసిన పోలీసులు షాక్ అయ్యి వాళ్ళని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. అయితే నిజానికి వీళ్ళిద్దరికీ అసలు పరిచయమే ఉండదు. అయితే అలా పోలీసులు తీసుకెళ్తున్న కార్లోనే వీరిద్దరూ పరిచయం చేసుకుంటారు. ఇంకేముంది ఆ జంట మధ్య మాటలు కలిసి, ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలో ఇద్దరూ తింగర పనులు చేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే ఫుల్లుగా తాగేసి రోడ్లమీద గోల చేయడం, ఇద్దరు కలిసి బండి మీద నైట్ అంతా షికారు చేయడం, క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగడం లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు.

మొత్తానికి ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పిచ్చి ప్రేమ మొదలవుతుంది. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు ట్విస్ట్. వెకేషన్ కోసం వచ్చిన హీరోయిన్ అక్కడ్నుంచి వెళ్లిపోయే టైం వచ్చేస్తుంది. ఇదంతా హీరోకి చెప్పకుండా ఇన్ని రోజులు తనతో ఇంత హ్యాపీగా హీరోయిన్ ఎందుకు ఉంది? చివరికి అతని వదిలేసి వెళ్లిపోయిందా?. లేదా. అసలు వీరిద్దరి లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎలాంటి మలుపు తిరిగింది ? అనే విషయాలు తెలియాలంటే ‘మండే’ అనే ఈ మూవీనీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌లోఈ సినిమాను చూసేయండి.



Next Story