Vishal: 19ఏళ్ల కెరీర్‌లో 12 పెళ్లిళ్లు చేశారు.. హీరో విశాల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-09-15 04:37:09.0  )
Vishal: 19ఏళ్ల కెరీర్‌లో 12 పెళ్లిళ్లు చేశారు.. హీరో విశాల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా ఈ రోజు థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్‌ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సాధారణంగా నేను వివాదాలపై స్పందించను. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ట్వీట్‌ చేశాను. నటి లక్ష్మీ మేనన్‌ను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అవతలి అమ్మాయి భవిష్యత్‌ కూడా ఉంది. నేను స్పందించకపోతే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. నా గురించి ఏ విషయమైనా మీరు ఫోన్‌ చేసి అడగవచ్చు. గతంలో చాలా మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. నిజం చెప్పాలంటే నా 19ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ 12మందిని పెళ్లి చేసుకున్నట్లు రాశారు.

చిన్నప్పటి నుంచి నాకు సంబంధించిన విషయాలు పేపర్‌లో వస్తే, కట్‌ చేసి భద్రపరచడం మా నాన్నగారికి అలవాటు. అలా ఒకరోజు ఏదో పేపర్‌ కట్‌ చేస్తుంటే, ఏం చేస్తున్నారు అని అడిగా, లక్ష్మీ మేనన్‌తో నీకు పెళ్లి అని వార్త వచ్చింది అన్నారు. అలా ఆ విషయం నాకు తెలిసింది. హీరోయిన్‌లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా భోజనానికో, సినిమాకో వెళ్దామని వాళ్లు అడిగితే, నేను వద్దని చెబుతాను. బయట జంటగా కనిపిస్తే, డేటింగ్‌లో ఉన్నామని వార్తలు రాసేస్తారు. అందుకే మా ఇంట్లో భోజనం చేసి, సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. తెలుగు ఇండస్ట్రీలోనూ రానా, నితిన్‌, నాని నాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story