పవిత్రతో పెళ్లిపై నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు.. ఫిల్మ్ నగర్‌లో మొత్తం అదే టాక్!

by sudharani |   ( Updated:2023-08-26 11:44:18.0  )
పవిత్రతో పెళ్లిపై నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు.. ఫిల్మ్ నగర్‌లో మొత్తం అదే టాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ ఇంటస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. వీరి రిలేషన్ గురించి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రమే రియాక్ట్ అయ్యారు కానీ.. కుటుంబ సభ్యులు ఎవరు మీడియా ముందు స్పందించలేదు. తాజాగా.. నరేష్ కొడుకు నవీన్ వీళ్ల రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా ‘సత్య’. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్‌ను.. నరేష్-పవిత్ర రిలేషన్ గురించి మీరు ఏం అనుకుంటున్నారని ప్రశ్న ఎదురైంది.

దీనికి స్పందించిన నవీన్.. ‘‘వాళ్లు మాత్రమే అలా చేయలేదు. బయట చాలా మంది అలా చేసిన వాళ్లు ఉన్నారు. అందులో సోషల్ మెసేజ్ ఏం లేదు. జీవితం ఉన్నంత వరకు ప్రశాంతంగా, ఆనందంగా బతకడమే ఎవరి లక్ష్యం అయినా. ఎవరో ఏదో అనుకుంటున్నారని భయపడితే ఎప్పటికీ సంతోషంగా జీవించలేము. మా నాయనమ్మ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎప్పుడూ చెప్పలేదు. మాకు నచ్చినట్లు బతకమని ఫ్రీడమ్ ఇచ్చారు. అదే నాన్న ఫాలో అవుతారు. నా పెళ్లి కూడా నా ఇష్ట పూర్వకంగా చేసుకోమన్నారు. ఆయన వచ్చి అక్షింతలు వేసి వెళతా అని చెప్పారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నవీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story