Court Movie Review : నాని ‘కోర్టు’ మూవీ రివ్యూ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా..

by Kavitha |   ( Updated:2025-03-14 05:20:22.0  )
Court Movie Review : నాని ‘కోర్టు’ మూవీ రివ్యూ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్(Nani) నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కోర్టు(Court- State vs A Nobody). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ సినిమా నేడు (మార్చి 14) గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం..

కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా వైజాగ్‌లో 2013లో జరుగుతుంది. ఇంటర్ చదివి పార్ట్ టైం జాబ్స్ చేసుకునే చందు(హర్ష రోషన్), ఇంటర్ సెకండియర్ చదువుతున్న జాబిలి(శ్రీదేవి) ప్రేమలో పడతారు. శ్రీదేవి మామయ్య మంగాపతి(శివాజీ) పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన అంటే ఇంట్లో అందరికీ భయమే. జాబిలిని చందు తన ఇంట్లో అమ్మ, చెల్లికి పరిచయం చేయడంతో అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటుంది. చందు – జాబిలి విషయం మంగాపతికి తెలియడంతో జాబిలి చందు ఇంట్లో ఉన్నప్పుడు జాబిలి ఫ్యామిలీతో పాటు పోలీసులని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయిస్తాడు. మంగాపతి చందుపై రకరకాల కేసులు పెట్టిస్తాడు.

అయితే శ్రీదేవికి ఇంకా 18 ఏళ్ళు రాకపోవడంతో పోక్సో కేసు కూడా పెట్టిస్తాడు. చందు మనుషులు ఓ లాయర్ ని పెట్టుకున్నా అతను కూడా మంగాపతికి అమ్ముడుపోతాడు. నాలుగు రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ అనగా విజయవాడలో మోహన్ రావు(సాయి కుమార్) అనే లాయర్ గురించి తెలిసి చందు మనుషులు అక్కడికి వెళతారు. అతను కేసు తీసుకోను అని చెప్పడంతో ఎప్పట్నుంచో కేసు కోసం ఎదురుచూస్తున్న అతని అసిస్టెంట్ తేజ(ప్రియదర్శి) ఈ కేసుని తీసుకుంటాడు. మంగాపతి తరపున దాము(హర్షవర్ధన్) కేసు వాదిస్తాడు. మరి ఈ కేసులో చందుని లాయర్ తేజ నిర్దోషిగా ఎలా బయటకు తీసుకొచ్చాడు? మంగాపతి చందుపై తప్పుడు కేసులు ఎలా పెట్టాడు? వాటిని ఎలా ప్రూవ్ చేశారు? జాబిలి ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ లో కేసు గురించి కొంత చూపించి మొత్తం లవ్ స్టోరీనే నడిపించడంతో కాస్త సాగదీసినట్టు ఉంటుంది. అయితే చందు – జాబిలి టీనేజ్ లవ్ స్టోరీ చూస్తే మన కాలేజీ డేస్ గుర్తుకు వస్తాయి. ఇంటర్వెల్‌కి తేజ కేసు ఒప్పుకున్నాను అని లీడ్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్‌లో ఎలా వాదిస్తాడు అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్‌లో తేజ కేసు తీసుకున్న దగ్గర్నుంచి కోర్టులో వాదనలు, ప్రతి వాదనలు బాగా రక్తి కట్టిస్తాయి.

ఇంటర్ చదివే రోజుల్లోనే ఇప్పుడు ప్రేమలో పడుతున్నారు. దాని వల్ల ఏం జరుగుతుంది? మైనర్ అమ్మాయి‌తో మిస్ బిహేవ్ చేసినా, ప్రేమ పేరుతో ఇష్టంగా శృంగారం చేసినా ఎలాంటి కఠినమైన శిక్షలు ఉంటాయి అని ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాలి అనే పాయింట్ ని బలంగా చెప్పారు. చివర్లో పోక్సో చట్టం – ప్రేమను లింక్ చేసి ప్రియదర్శి మాట్లాడే మాటలు ఆలోచింపచేస్తాయి. ఫైనల్‌గా ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.


Read More..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Next Story

Most Viewed