- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. థియేటర్స్ ఓపెనింగ్ ఎప్పుడంటే..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు తెలంగాణలో థియేటర్స్ మరోసారి మూతపడిన విషయం తెలిసిందే. గత నెలలో లాక్‌డౌన్ ఎత్తేసినా థియేటర్స్ మాత్రం ఇంకా తెరచుకోలేదు. అందుకు కొత్త సినిమాలు లేకపోవడం, ఆక్యూపెన్సీ రేషియోను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిటర్ల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా సినిమా హాల్స్ ఓపెనింగ్‌పై తెలంగాణ ఎగ్జిబిటర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జులై నెల చివరి నాటికి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందని సంకేతమిచ్చారు. ఈలోపు కొత్త సినిమాలను తొందరపడి ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్ల సంఘం తీర్మానించింది. అక్టోబర్ వరకు నిర్మాతలు తమ సినిమాలను OTTలకు ఇవ్వకూడదని షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈలోగా ఎవరైనా ఓటీటీలకు సినిమాలు ఇస్తే వారిపై చర్యలకు త్వరలో నిర్ణయం తీసుకోనునున్నట్లు ప్రకటించాయి. ఓటీటీల వలన థియేటర్ వ్యవస్థకు ప్రమాదముందని ఆది నుంచే ఎగ్జిబిటర్లు గట్టిగా వాదిస్తున్న విషయం తెలిసిందే.