- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ఎన్నికలకు ఇక్కడెందుకు క్రేజ్?
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం అత్యంత ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ప్రతి రౌండ్ లెక్కింపు నరాలు తెగిపోయేలా అనిపించింది. చివరికి ఫలితాలు విడుదలై గెలిచినవారెవరో తెలిశాక.. స్థానికులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడి రాజకీయాల గురించి తెలిసిన ఒకరిద్దరు మినహా ఎవరూ తమ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అప్‌డేట్ చేయలేదు. కానీ గతవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మాత్రం అదేదో నేరుగా జో బైడెన్ వచ్చి వీళ్ల వాట్సాప్ స్టేటస్ చూస్తాడేమో అన్నట్లుగా ‘కంగ్రాట్స్ జో బైడెన్, బై బై ట్రంప్’ అంటూ స్టేటస్‌లు పెట్టారు. మరి స్థానికం అంటే చులకన అనుకోవాలా? లేదా ఇంటర్నేషనల్ అంటే పాష్ అనుకోవాలా?
జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే స్థానిక ఎన్నికలకన్నా, కనీసం ఓటు హక్కు కూడా లేని అమెరికా ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సరే.. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హారిస్ అంటే భారత సంతతికి చెందిన వారు కాబట్టి ప్రోత్సహించామని సమాధానం ఇస్తున్నవారు ఉన్నారు. పట్టుదల ఉంటే పక్క దేశాల్లో కూడా ప్రవాసీయులు రాజకీయ స్థానాలను అధిరోహించవచ్చని నిరూపించి, మహిళా సాధికారతకు ప్రతిరూపంగా నిలిచిందని కొందరు పొగిడేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా ఇంకొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురించి పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు కమలా హారిస్ గురించి బీరాలు పలకడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఎన్నికలను హైప్ చేయడం గురించి తప్పుబట్టడం లేదు, అదే స్థాయిలో మన దగ్గర అంతకంటే ఉత్కంఠగా సాగిన దుబ్బాక, బిహార్ ఎన్నికలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అక్కడి పాలకులే ప్రపంచాన్ని శాసిస్తారనే ఒక భావన ఉండటం వల్ల ఈ క్రేజ్ ఏర్పడిందని సోషల్ మీడియా నిపుణులు అంటున్నారు.