సూర్యాస్తమయ వేళ.. కనుల విందుగా బాలీవుడ్ అందాలు

by Shyam |
mouni roy
X

దిశ, సినిమా: ‘నాగిని’ టీవీ సీరియల్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటి మౌనీ రాయ్. హిందీ టెలివిజన్ చానల్స్‌లో పలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ఈ భామ బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్న ఈ బ్యూటీ ‘స్కిన్ షో’కు ఏ మాత్రం వెనకాడదు. ఇక సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటో షూట్ పిక్స్ షేర్ చేస్తుండే మౌని.. తాజాగా సముద్ర తీరంలో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, ప్రకృతిని కూడా అలానే ప్రేమించండి’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. సూర్యాస్తమయ వేళ.. పింక్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతున్న ఈ గులాబీ బాల ఫొటో చూసిన నెటిజన్లు ‘బ్యూటిఫుల్, స్టన్నర్’ అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు బీటౌన్ సెలబ్రిటీ, వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా‌తో పాటు పలువురు మౌని పోస్ట్‌కు లైక్ కొట్టడం విశేషం. ప్రస్తుతం మౌని బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’లో కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed