- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మదర్‌సన్ సిస్టమ్స్ త్రైమాసిక లాభం రూ. 136 కోట్లు!
దిశ, సెంట్రల్ డెస్క్: ఆటోమొబైల్ విడిభాగాల దిగ్గజ కంపెనీ మదర్‌సన్ సిస్టమ్స్ లిమిటెడ్ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ. 135.66 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 68.4 శాతం క్షీణించినట్టు కంపెనీ ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం రూ. 15,159.05 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఏడాది ఇది రూ .17,169.47 కోట్లుగా ఉంది. ఇక, మొత్తం ఆర్థిక సంవత్సరం నికర లాభం రూ. 1,294.44 కోట్లను నమోదు చేసింది. ఆదాయం రూ. 63,536.87 కోట్లుగా నమోదైంది. ఇది 2018-19లో 63,522.88 కోట్ల రూపాయలుగా ఉందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా సరఫరా ఆగిపోవడం, అమ్మకాలు క్షీణించడం, చైనా, యూరప్ దేశాల్లో ప్లాంట్ల మూసివేత వల్ల కంపెనీ పనితీరు క్షీణించినట్టు, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ ఆదాయాన్ని స్థిరంగా నమోదు చేయగలిగామని కంపెనీ వివరించింది. వినియోగదారుల నుంచి అత్యధికంగా ఆర్డర్లు వచ్చాయని, తమపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని మదర్‌సన్ సుమి ఛైర్మన్ వివేక్ చంద్ వెల్లడించారు.