లాభాలను సాధించిన మదర్సన్ సుమీ

by Harish |
లాభాలను సాధించిన మదర్సన్ సుమీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ ఆటో విడిభాగాల దిగ్గజ సంస్థ మదర్సన్ సుమీ రూ. 798 కోట్ల ఏకీకృత నికర లాభాలను నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 271 కోట్లతో పోలిస్తే ఇది 194 శాతం పెరిగిందని కంపెనీ శుక్రవారం తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రికార్డు స్థాయిలో 15 శాతం పెరిగి రూ. 17,923 కోట్లకు చేరుకుంది. ఎబిటా(వడ్డీ, పన్ను, రుణాలకు ముందు ఆదాయం) 56 శాతం పెరిగి రూ. 2,041 కోట్లకు చేరుకున్నాయి.

గత ఆర్థిక సంవత్సర ఇదే కాలంలో ఇది రూ. 1,309 కోట్లుగా నమోదయ్యాయి. ‘కార్యకలాపాలు సాధారణ స్థయికి చేరుకున్నాయి. చాలావరకు కరోనా పూర్వస్థాయిలో కొనసాగుతున్నాయి. వినియోగదారుల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డాయి. అదేవిధంగా మదర్సన్ సుమీ ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సంస్థ పనితీరు నిరంతర అభివృద్ధికి సాధిస్తున్నట్టు’ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘తమ వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అంతర్జాతీయ భాగస్వాములు విశేష కృషిని కనబరిచారు. ఈ త్రైమాసికంలో సంస్థ ఫలితాలు వారి కృషికి, మదర్సన్ వినియొగదారుల నమ్మకానికి ప్రతిబింబం. రానున్న త్రైమాసికాల్లో డిమాండ్, సానుకూల పరిస్థితులు నెలకొంటాయని ఆశలున్నాయని’ మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్ వివేక్ చాంద్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed