- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాక్షస కొడుకు.. కన్న తల్లి హత్యకు 5 లక్షలు సుపారీ
దిశ, చార్మినార్ : తన భర్త భిక్షపతి హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేసింది లలిత అనే ఓ ఇల్లాలు. మృతికి రెండుమూడు రోజుల క్రితం ఆయురారోగ్యాంగా కనిపించిన భర్త ఇంతలోనే విగతజీవిగా మారాడని, పోస్టుమార్టం చేసి ఉంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చేవని భార్య లలిత ఆరోపించింది. అస్థి కోసం తనను, తన భర్తను తన కన్నకొడుకే విడగొట్టడని ఆమె తీవ్రంగా ఆరోపించింది. తన భర్త మృతదేహంతో ఒక కొడుకు శవ రాజకీయాలు చేయడం ఏంటి అని వాపోయింది. ఆదివారం ఉప్పుగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించింది.
1982లో భిక్షపతితో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు అభిలాష్ సంతానం. ఉప్పుగూడలో సెయింట్ మేరీస్ పాఠశాలను నడుపుతున్నానని చెప్పింది. అప్పటికే తను సంపాదించి కట్టిన ఇల్లును తన భర్త పేరు మీద చేయమని ఒత్తిడి చేయగా చేశానని, తన కొడుకుకు మూడు ఇండ్లు కట్టించానని, బాటసింగారంలో 300 గజాల స్థలం కూడా ఇచ్చానని తెలిపింది. ఆస్థిలో తన కొడుకు వాటా కొడుకుకు ఇచ్చానని, ఘనంగా అతని పెళ్లి కూడా జరిపించానని చెప్పింది. అప్పటి వరకు బాగానే కలిసి ఉన్నామని, 2017 నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని, తన భర్త పెరు మీద ఉన్న అస్థి ఇల్లు కోసం తన కొడుకు విభేదాలు సృష్టించి తనను, తన భర్తను వేరు చేశాడని వాపోయింది. కన్న తల్లి నైన తనను చంపడానికి 5లక్షలు సూపరీ కూడా ఇచ్చాడని ఆరోపించింది.
సుపారీకి ఒప్పందం కుదుర్చున్న వ్యక్తే స్వయంగా వచ్చి చెప్పేవరకు తన వెనుక ఇంత కుట్ర జరుగుతున్న విషయం అర్ధం కాలేదన్నారు. తనకు, తన ఇద్దరు కూతుళ్ళకు కొడుకు అభిలాష్ తో ప్రాణహాని ఉందని, తమను రక్షించాలని కన్నీటి పర్యంత మయింది. తన కొడుకు నుంచి తమను రక్షించాలని లలిత వేడుకుంది.