- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లుడిని హత్య చేసిన అత్త
X
దిశ, వెబ్‌డెస్క్: తన కూతురు ఆత్మహత్యకు ప్రతీకారంగా అల్లుడిని దారుణంగా హత్య చేసింది అత్త. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌కు చెందిన నవీన్‌కు మీర్‌పేటకు చెందిన ఓ యువతితో వివాహమైంది. పెళ్లి అయిన నెలకే నవీన్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య కేసులో నవీన్ జైలుకు వెళ్లాడు.
ఇటీవలే నవీన్ జైలు నుంచి విడుదల అయ్యాడు. విషయం తెలుసుకున్న అత్త అనిత గురువారం ఉదయం నవీన్ ఇంటికి వెళ్లి అల్లుడిపై కత్తితో దాడి చేసి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవీన్ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని, ఆ కోపంతోనే అనిత ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
Next Story