- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుజ్జి పిల్లుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లి పిల్లి… వైద్యం చేసిన డాక్టర్లు (వీడియో)
దిశ, ఫీచర్స్: తల్లి ప్రేమకు కొలమానాలు ఉండవు. బిడ్డను కాపాడుకునేందుకు ఎంత దూరమైన వెళ్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. చావు నోట్లో తల పెట్టైనా సరే తన బిడ్డల్ని దక్కించుకుంటుంది. అందుకు ప్రపంచాన్నైనా ఎదిరిస్తుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లోనూ చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఈ క్రమంలో ఓ పిల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రపంచాన్నే మెల్ట్ చేసింది. బిడ్డ అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేని తల్లి పిల్లి.. దాన్ని నోట కరుచుకని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఘటన సౌత్ టర్కీలో జరిగింది. సహాయం కోసం వచ్చిన తల్లి పిల్లికి ఆ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు హెల్ప్ చేశారు. బుజ్జి పిల్లిని ఎగ్జామిన్ చేసి ఐ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుందని తెలుసుకున్న వైద్యులు తగిన ట్రీట్‌మెంట్ అందించారు. అంతేకాదు ఆ తల్లి పిల్లికి పుట్టిన మరో బుజ్జి పిల్ల జాడ కూడా తెలుసుకుని, ఫ్యూచర్‌లో తనకు కూడా ఇలాంటి ఇన్‌ఫెక్షన్ రాకుండా ఐ డ్రాప్స్ వేశారు. ఈ వీడియోను యూఏఈ మీడియా సంస్థ ‘గల్ఫ్ టుడే’ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.
Mother cat carries sick kitten into Turkish hospital and 'asks doctors for help' https://t.co/37K7aiSTD7 #CatsOfTwitter #Turkey pic.twitter.com/fNAqRW67Mb
— Gulf Today (@gulftoday) March 30, 2021