- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడి కోసం రెండేళ్ల పసిబిడ్డ(ప్రదీప్)ను చిత్రహింసలు పెట్టిన కన్న తల్లి (తులసి)ని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిపోతుండగా నిందితురాలిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ అమానుష ఘటన తమిళనాడులోని విల్లిపురం జిల్లా సత్యమంగళం మండలం మెట్టూరులో చోటుచేసుకుంది. మెట్టూరుకు చెందిన తులసి అనే మహిళకు రెండేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త తులసిని వదిలేశాడు.
ప్రియుడి మోజులో పడి భర్తకు దూరం కావడం, ఇదే సమయంలో కళ్ల ఎదుటే ఎదుగుతున్న బాబును చూసి ఓర్చుకోలేక పోయింది తులసి. దీనికితోడు ప్రియుడిని సంతోషపెట్టేందుకు.. భర్తను టార్చర్ చేసేందుకు రెండేళ్ల బాబును కొడుతూ వీడియోలు తీసింది. ఇలా తీసిన వీడియోలను ప్రియుడికి, భర్తకు.. ఇద్దరికీ సెండ్ చేసింది. బాబు గోస చూడలేకపోయిన సదరు తండ్రి తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తల్లి చిత్రహింసలకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి.
ఈ వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 బృందాలుగా ఏర్పడ్డారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుంగనూరులో సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆదివారం దాడులు చేసి తులసిని అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే బాబును చిత్ర హింసలు పెట్టిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.