- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మూర్ లో దారుణం.. ఒకేచోట తల్లీకొడుకుల హత్య..
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్న తల్లీ కొడుకులు అనుకోని విధంగా హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గోవింద్ పేట్ రోడ్డులో ఉన్న నూతన ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేల్పూర్ కు చెందిన అనిల్ గౌడ్ (40), రాజుబాయి (70) తల్లీకొడుకులు. వీళ్లు ఆరు నెలలుగా ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న బిల్డింగులో తల దాచుకుంటున్నారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ, అక్కడక్కడా యాచిస్తూ పొట్ట నింపుకుంటున్నారు.
సోమవారం తల్లీకొడుకులిద్దరూ ఒకేచోట విగత జీవులై పడి ఉండటాన్ని అటుగా వెళ్ళిన వారు గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ రఘు, సీఐ సైదేశ్వర్ పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అనిల్ గౌడ్ ఆదివారం రాత్రి మద్యం మత్తులొ ఉన్న వరికుప్పల శ్రీను అనే వ్యక్తితో గొడవ పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇది హత్యేనేమో అని అనుమానిస్తున్నారు. హంతకుడిగా అనుమానిస్తున్న వరికుప్పల శ్రీను మామిడిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు.