మరోసారి ఎమ్మార్వో ఆఫీసులో రాష్ట్రం ఉలిక్కిపడే ఘటన (వీడియో)

by Anukaran |   ( Updated:2023-03-14 09:02:35.0  )
suicide attempt at MRO Office
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : మరోసారి తెలంగాణలో రాష్ట్రం ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో తరచూ ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ఆత్మహత్యాయత్నం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కూడా అలాంటి ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. ఎమ్మార్వో ఆఫీసు ముందు తల్లీ కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. (వీడియో కింద ఉంది చూడవచ్చు)

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహశీల్దార్ కార్యాలయం ముందు ఘనాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ (38) అనే మహిళ తన కూతురితో కలిసి పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపింది. తన భర్త చనిపోతే రైతు ఆర్థిక సహాయం కింద వచ్చిన డబ్బులు డ్రా చేయనివ్వకుండా ఎమ్మార్వో శ్రీనివాస్ రావు ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

కుల్కచర్ల మండలం ఘనాపూర్ గ్రామానికి చెందిన దండు సాయిలు అనే రైతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2017లో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా 2019లో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కింద మంజూరయ్యాయి. చెక్ రూపంలో ఉన్న ఆర్థిక సహాయం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భార్య రాములమ్మ, కుల్కచర్ల తహశీల్దార్ పేరిట జాయింట్ అకౌంట్లో జమ చేయబడ్డాయి.

కుటుంబానికి ఆర్థిక సహాయం చేదోడు వాదోడుగా ఉంటుందని, వాటితో గేదెలు కొని జీవనం కొనసాగిద్దామనుకున్న వారికి తహశీల్దార్ కార్యాలయంలో చుక్కెదురైంది. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేందుకు 2019 నుండి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పొంతన లేని సమాధానాలు చెబుతూ తమను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని… కుటుంబ పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్యే శరణ్యమని భావించి కూతురితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధిత మహిళ కన్నీరుమున్నీరైంది.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 6300 అడుగల ఎత్తు నుంచి పడిపోయిన మహిళలు

Advertisement

Next Story

Most Viewed