4 నెలల నుంచి వాహనాలు కదల్లేదు

by Shyam |
4 నెలల నుంచి వాహనాలు కదల్లేదు
X

దిశ, ముషీరాబాద్: కరోనా కల్లోలం కారణంగా విధించిన లాక్ డౌన్‌తో రవాణా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లిందని తెలంగాణ స్టేట్ క్యాబ్, బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నిజాముద్దీన్ అన్నారు. దీంతో తమను ఆదుకునేందుకు మోటార్ వాహనాల పన్ను మాఫీ చేయాలని కోరారు. అలాగే బకాయిలపై విధించిన జరిమానాలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనాతో 4 నెలల నుంచి వాహనాలు గ్యారేజీ నుంచి కదల్లేదన్నారు.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిoది పోయి టాక్స్‌ తో పాటు పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపడం సమంజసం కాదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి ట్రావెల్ పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story