- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత వృద్ధి అంచనాను తగ్గించిన క్రిసిల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదివరకు భారత వృద్ధిని 7.8 శాతంగా అంచనా వేసిన క్రిసిల్, తాజాగా దీన్ని 7.3 శాతానికి సవరించింది. క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ఎగుమతులకు సంబంధించి ప్రపంచ డిమాండ్ తగ్గడం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల వృద్ధి నెమ్మదిస్తుందని క్రిసిల్ అభిప్రాయపడింది. అధిక ద్రవ్యోల్బణ వల్ల కొనుగోలు శక్తి పడిపోతుందని, వినియోగం పునరుద్ధరణపై ప్రభావం చూపిస్తుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
అయితే, సాధారణ రుతుపవనాలు, సేవల రంగంలో గిరాకీ పునరుద్ధరణ వంటి పరిస్థితులు వృద్ధికి మద్దతిస్తాయని, వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. పెరిగిన సరుకుల ధరలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, సరఫరా వ్యవస్థ భారత కరెంట్ ఖాతాపై ఒత్తిడి పెంచుతున్నాయని క్రిసిల్ ప్రస్తావించింది. కాగా, ఆర్‌బీఐ ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.