- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టాచ్యూ ఆఫ్ యూనిటీకే ఎక్కువ విజిటర్లు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యునిటీకే ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఐక్యతా విగ్రహాన్ని ప్రారంభించిన రెండేళ్లలో ఇప్పటికే 50 లక్షల మంది సందర్శించారని తెలిపారు. గుజరాత్‌లో ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహమున్న కెవాడియాకు దేశవ్యాప్తంగా పలుప్రాంతాల నుంచి ఎనిమిది ట్రైన్ సేవలను ప్రధానమంత్రి మోడీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘నేడు కెవాడియా ఒక మారుమూల ప్రాంతం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద సందర్శన స్థలంగా మారబోతున్న గ్రామం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎక్కువ మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శించనున్నారు. కరోనా కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది’ అని తెలిపారు. ట్రైన్ సేవల అనుసంధానంతో కేవలం పర్యాటకులే కాదు.. స్థానికులూ ఎక్కువగా లబ్ది పొందుతారని పేర్కొన్నారు. స్టాచ్యూ ఆఫ్ యునిటీతోపాటు కెవాడియా చుట్టుపక్కల ప్రాంతాలకూ పర్యాటకులు పెరుగుతారని అన్నారు.