దేశంలో కోటి దాటిన కరోనా రికవరీలు

by Anukaran |
దేశంలో కోటి దాటిన కరోనా రికవరీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశమంతా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతున్న సమయంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ ‘డ్రై రన్’కు సన్నాహాలు చేస్తుండగానే మరోవైపు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 1.04 కోట్ల పాజిటివ్ కేసులు నమోదుకాగా కోటిమందికి పైగా ఈ వైరస్ బారి నుంచి బయటపడ్డారు. లక్షన్నర మంది మాత్రం కేవలం కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం రెండు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశం మొత్తం మీద కొత్తగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో దాదాపు మూడో వంతు ఒక్క కేరళ రాష్ట్రం (6,394)లోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (4,382) ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వెయ్యికి లోపే (చత్తీస్‌గఢ్ మినహా) నమోదయ్యాయి. ఇటీవలి కాలం వరకు కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులకంటే రికవరీ అవుతున్న పేషెంట్ల సంఖ్యే ఎక్కువగా ఉండేది. కానీ రెండు రోజులుగా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కారణం కావచ్చని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed