మరో మూడు బ్యాంకులు విలీనమయ్యే ఛాన్స్!

by  |
మరో మూడు బ్యాంకులు విలీనమయ్యే ఛాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై అధిక ప్రాధాన్యత చూపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక బ్యాంకులను విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు బ్యాంకులను విలీనం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులు నీతి అయోగ్‌తో మరోసారి బ్యాంకుల విలీనానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈసారి, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను విలీనం చేయాలని చూస్తోంది. గతంలో కేంద్రం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా మార్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు విలీనం చేయబడ్డాయి. అలాగే, ఇండియన్, అలహాబాద్ బ్యాంకుతో విలీనం చేయబడింది. యూనియన్ బ్యాంకులో ఆంధ్రబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం చేయబడ్డాయి. కెనరా బ్యాంకు, సిండికెట్ బ్యాంకులు విలీనం జరిగాయి.


Next Story

Most Viewed