- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్యాణ లక్ష్మికి నిధుల పెంపు..
దిశ,తెలంగాణ బ్యూరో : పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు చేయూతనిచ్చే కల్యాణ లక్ష్మి స్కీంకు బడ్జెట్‌లో ఈ సారి నిధుల కేటాయింపు పెరిగింది. గత ఏడాది కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కలిసి ప్రభుత్వం రూ.350 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. అయితే కల్యాణ లక్ష్మికి వస్తున్న దరఖాస్తులు ప్రతీ ఏటా పెరుగుతుండడం, వెనకబడిన తరగతుల నుంచి కల్యాణ లక్ష్మి పథకం డబ్బుల కోసం అప్లికేషన్స్ ఎక్కువగా వస్తుండడంతో.. సర్కార్ ఈ పథకానికి ఈ సారి కేటాయింపులను పెంచింది.
అందులో భాగంగానే కల్యాణ లక్ష్మి స్కీంకు రూ.1,850 కోట్లకు బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. దీంతో 2021-22 వార్షిక సంవత్సరంలో మరింత మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి ఫలాలు అందనున్నాయి. ప్రస్తుతం ఈ స్కీం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ.1,00,166లను అందజేస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ 8,04,521 మంది లబ్ధి పొందగా.. సర్కార్ రూ.6,480 కోట్ల బెనిఫిట్స్ ను లబ్దిదారులకు అందజేసింది.