- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ ఏడాది సాధారణ వర్షపాతమే : ఐఎండీ
న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర భూగర్భ మంత్రిత్వ శాఖ (ఎర్త్ సైన్సెస్) సెక్రెటరీ ఎం. రాజీవన్ ఆన్లైన్ ద్వారా మీడియాకు వివరాలను వెల్లడించారు. నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో 98 శాతం వర్షపాతం నమోదవుతుందని ఆయన తెలిపారు. భారత్ లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈసారి ఆ 4 నెలల కాలంలో వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం మధ్య ఉంటుందని ఐఎండీ తెలిపింది. సగటున అది 98 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనావేసింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్‌పీఎ) ఆధారంగా ఈ అంచనావేస్తారు. భారత్ లో సాధారణంగా జూన్ 1 న నైరుతి రుతు పవనాలు కేరళను తాకుతాయి. ఇవే దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకం. కాగా, గతేడాది కూడా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసినా.. దానికి మించి వర్షాలు కురిసిన విషయం విదితమే.