బాలుడు నా బిడ్డ.. కౌగిలించుకున్న కోతి.. బ్రతిమాలిన మహిళ

by Sujitha Rachapalli |   ( Updated:2023-12-15 16:48:50.0  )
బాలుడు నా బిడ్డ.. కౌగిలించుకున్న కోతి.. బ్రతిమాలిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కోతి మన దగ్గరకు వస్తుందంటేనే మనం భయపడిపోతాం. అలాంటిది కోతి మన ఎదుటే కూర్చుని.. మనల్సి హత్తుకుంటే ఎలా ఉంటుంది.. ఎంత భయమేస్తుంది. ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదా. కానీ ఈ వీడియోలో మాత్రం.. ఓ బాలుడితో కోతి ఆటాడుకుంది. రోడ్డుపై కూర్చుని బాలుడితో కాసేపు ఆడుకుంది. బాలుడిని.. తన సొంత బిడ్డలా చూసుకుంది. బాలుడిని హత్తుకుని.. అక్కడే కూర్చుని ఓ మహిళను ముప్పుతిప్పలు పెట్టింది.


కోతి నుంచి బాలుడిని విడిపించడానికి ఓ మహిళ ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపించింది. కోతి ఆ బాలుడిని విడిచిపెట్టకుండా గట్టిగా కౌగిలించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కోతి చాలాసేపటి తర్వాత ఆ బాలుడిని వదిలిపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. కోతులు ఇలా చిన్నారులతో ఆడుకోవడం, వస్తువులను దొంగలించడం కొత్తేమీ కాదు. మనుషులపై కోతులు దాడి చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed