సోమవారం పంచాంగం, రాశిఫలాలు (31-05-2021)

by Hamsa |
సోమవారం పంచాంగం, రాశిఫలాలు (31-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్‌, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(తెల్లవారు జాము 2 గం॥ 16 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారు జాము 1 గం॥ 10 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(నిన్న సాయంత్రం 4 గం॥ 48 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 7 ని॥ వరకు)
యోగము : బ్రహ్మము
కరణం : గరజ
వర్జ్యం : (రాత్రి 8 గం॥ 8 ని॥ నుంచి 9 గం॥ 44 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 6 గం॥ 0 ని॥ నుంచి 7 గం॥ 33 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 12 గం॥ 39 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 31 ని॥ వరకు) (సాయంత్రం 3 గం॥ 16 ని॥ నుంచి 4 గం॥ 8 ని॥ వరకు)
రాహుకాలం : ( ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి 8 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : ( మధ్యాహ్నం 1 గం॥ 51 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 29 ని॥ వరకు)
యమగండం : ( ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి 12 గం॥ 12 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మకరము

మేషరాశి : అన్ని వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి గాని స్నేహితుల నుంచి గాని బహుమానాలు అందుకుంటారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విముక్తి. అప్పు అడగటమే కానీ తీర్చని స్నేహితులను వదిలించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం. నిజాయితీగా కష్టపడండి అంతిమ విజయం మీదే. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోని ఆహ్లాదకర వాతావరణం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

వృషభ రాశి : ఫిట్ నెస్ కొరకు యోగ మెడిటేషన్ తో పాటు ఆటలు ఆడండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు. ఇంటిలోనే వ్యక్తులతో వాదోపవాదాలకు దిగకండి. దాని వలన మానసిక అశాంతి. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. శాంతంగా ఉండండి. ప్రతి పనికి ఇతరుల మీద ఆధార పడటం వలన అశాంతి. ఆధ్యాత్మిక చింతన మొదలౌతుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో పాత విషయాలను మర్చిపోండి కొత్త జీవితం ప్రారంభించండి

మిథున రాశి : ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. మీ చిరకాల స్వప్నం నెరవేరనుంది. అతి ఉత్సాహం తొందరపాటు అవుతుంది. కొంతమందికి జీతం రాక పోవటం వలన అప్పులు చేసే అవకాశం. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరికి తొందరపడి మాట ఇవ్వకండి. ఉజ్వల భవిష్యత్తుకు సరైన ప్రణాళిక వేయండి గుర్తుంచుకోండి కాలం తిరిగి రాదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక మంచి రోజు.

సింహరాశి : అన్ని విధాలుగా అనుకూలమైన కాలం నడుస్తోంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఫిట్ నెస్ కోసం చేసే ప్రయత్నాల వలన శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరం గా ఉండి అవసరాలకు తగిన డబ్బు లభిస్తుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులన్నీ చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కన్యరాశి : సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి లాభాల బాట పడతారు. సామాజిక కార్యక్రమాలలో మీ ప్రవర్తన అందరి మెప్పు పొందుతుంది. దగ్గు జలుబు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రయాణాలు వాయిదా వేయండి. కొంతమందికి ఉద్యోగ మార్పు. ఆఫీసులో ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త నుండి ఒక బహుమతి అందుకుంటారు.

కర్కాటక రాశి : నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ముందు నచ్చకపోయినా అందరి సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు దానాలు చేయడం వలన మనశ్శాంతి. డబ్బు సంపాదనలో ఆరితేరు తారు. మీకు మీ మీద నమ్మకమే మీ పెట్టుబడి. ఈ రాశి స్త్రీలు కుటుంబం అంటే ఒకరి కోసం ఒకరం అనే విషయాన్ని మీ భర్తకు తెలియజేయండి.

వృశ్చిక రాశి : బంధువుల మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దీనివలన మీ ఆత్మ విశ్వాసం రెట్టింపవుతుంది. కొంతమందికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆధ్యాత్మిక మార్గం లోకి వెళ్ళడానికి కావలసిన సూచనలు లభిస్తాయి. యోగ మెడిటేషన్ మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు పై అధికారుల మెప్పు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు నూతన వస్త్రాలు నగలు కొనే అవకాశం.

తులారాశి : అధిక శ్రమ వలన మానసిక అశాంతి. ఈ కరోనా సమయంలో లేనిపోని భయాందోళనలను వదిలివేయండి. దాని వలన ఆరోగ్య సమస్య రావచ్చు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చులు వదిలివేయండి. ఉద్యోగంలో మీ అభిప్రాయాలను అవతల వారికి చెప్పండి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి కావలసిన సూచనలు లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి : ఆర్థిక పరిస్థితి బాగుంది డబ్బు సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంలో వ్యక్తులు ఒకరితో ఒకరు ఘర్షణ పడతారు. మీరు అందర్నీ సమాధానపరచ లేరు. ఆఫీసులో వర్క్ ను పూర్తి చేయటానికి మీ తెలివితేటలు ని ఉపయోగించండి ఒక ప్రణాళిక ప్రకారం పని చేయండి. ఇది మీ సామర్ధ్యానికి పరీక్ష. ఇతరులకు మీరు ఇచ్చిన సూచనలు సలహాలు పనిచేస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీ మీద చూపిస్తున్న శ్రద్ధ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మకర రాశి : శారీరక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కరోనా సమయంలో మానసిక ఆరోగ్యం కూడా అవసరమే. యోగ మెడిటేషన్ చేయండి. రోజు వారి కార్యక్రమాలు బోర్ కొడతాయి. మీ జీవిత భాగస్వామి పేరుమీద చేస్తున్న వ్యాపారం కలిసి వస్తుంది. ఆఫీసులో మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మీద ఒకరికి ఒకరు కు అనురాగం ఎక్కువవుతుంది.

కుంభరాశి : నిదానంగా పని చేస్తే ఫలితం వస్తుంది. జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకోండి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతోంది. ఆఫీసులో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలు వద్దు. అలా అని వారి మాటలకు అధిక విలువ ఇవ్వకండి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రుణాలు చేతికి అందుతాయి. కుటుంబ వ్యక్తులు కంప్లైంట్ చేయకముందే వారికి సమయం కేటాయించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : ఎంతో కాలం నుంచి నడుస్తున్న కోర్టు కేసు మీకు పూర్తిగా అనుకూలం. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా అనుకూలం. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో అన్ని విధాలుగా లాభం. ఆఫీసులో వర్క్ లో మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

Advertisement

Next Story

Most Viewed