సోమవారం పంచాంగం, రాశిఫలాలు(24-05-2021)

by Hamsa |
సోమవారం పంచాంగం, రాశిఫలాలు(24-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
( తెల్లవారు జాము 3 గం॥ 38 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారు జాము 0 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న ఉదయం 12 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 48 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : కౌలవ
వర్జ్యం : ( మధ్యాహ్నం 2 గం॥ 46 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 11 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (తెల్లవారు జాము 4 గం॥ 1 ని॥ నుంచి 5 గం॥ 27 ని॥ వరకు)( రాత్రి 11 గం॥ 17 ని॥ నుంచి తెల్లవారు జాము 0 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( ఉదయం 12 గం॥ 38 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు) (సాయంత్రం 3 గం॥ 14 ని॥ నుంచి ఈ…)

మేష రాశి : ప్రముఖులతో పరిచయాలు మీ వ్యాపారంలో పెట్టుబడులను తెస్తాయి. ప్రతి పనిలో విజయం పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేయండి. దూరపు బంధువుల నుండి వచ్చిన ఒక శుభవార్త మీ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తుతుంది. కార్యాలయంలో మీ సహ ఉద్యోగుల మద్దతుతో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ రాశి స్త్రీలు నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు.

వృషభ రాశి : ఆర్థికంగా బాగుంది. మీ పిల్లలు చేస్తున్న పనుల పట్ల క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకోకండి. వారిని బాధపెట్టకుండా సరైన నిర్ణయం తీసుకోండి. కార్యాలయంలో సహ ఉద్యోగులను చాకచక్యంగా deal చెయ్యండి. జీవిత భాగస్వామితో గడపటానికి ఆనందకరమైన రోజు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే సమయం. ఈ రాశి స్త్రీలకు మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి.

మిధున రాశి : కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. భార్య భర్తల విషయంలో మూడవ వ్యక్తి యొక్క జోక్యం ఇబ్బంది కరం. దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గుముఖం పట్టే అవకాశం. ఆవేశంతో కాకుండా ఆలోచించి పని చెయ్యండి. లేకుంటే అనారోగ్యం తిరగబెట్టే అవకాశం. అనువంశికంగా రావాల్సిన ఆస్తి విషయంలో శుభవార్త అందుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ ఖర్చులను సరిగ్గా అంచనా వేయండి.

కర్కాటక రాశి : ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయి. సరైన ప్రణాళికతో డబ్బును పొదుపు చేయండి భవిష్యత్తు బంగారు మయం. ఈ కరోనా సమయంలో సరైన పోషకాహారం తీసుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో రావలసిన పెట్టుబడులు సమకూరుతాయి. కుటుంబములోని వ్యక్తులతో పరుషంగా మాట్లాడకండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

సింహరాశి : స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడుల వల్ల నష్టం వచ్చే అవకాశం. కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తో పెట్టుబడులు పెట్టండి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. నిరుత్సాహాన్ని దరికిరానీయకండి. చిన్ననాటి స్నేహితులను కలవడం వల్ల మీలో ఉత్సాహం. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే రోజు. పాతబాకీలు వసూలవుతాయి. పుణ్య క్షేత్ర లేక గుడి సందర్శన. కార్యాలయంలో మిమ్మల్ని చికాకు పెడుతున్న మీ ప్రత్యర్థుల మీద మీరు విజయం సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు ప్రపంచం మొత్తాన్ని వదిలి దూరంగా ఎక్కడన్నా ఉందాం అనిపిస్తుంది.

కన్య రాశి : ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. వ్యాపారంలో మీరు పెడదాం అనుకున్న పెట్టుబడులను భాగస్వాములు వ్యతిరేకిస్తారు. కుటుంబంలోని వ్యక్తులు మీ ప్రవర్తన ల వలన బాధ పడే అవకాశం. బంధువుల మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి యొక్క కేరింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.

తులారాశి : నిర్మలమైన మనసుతో తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును సూచిస్తోంది. కార్యాలయంలో మీ పని మీరు చేసుకోండి వేరేవారి గురించి ఆలోచించకండి. సన్నిహితులు మిత్రులు అన్ని విధాలుగా సహాయ పడతారు. అనవసరమైన ఖర్చులను చేస్తారు. ఇంటిలోని చిన్నచిన్న గొడవలు చికాకు తెప్పిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీరు మీ పిల్లలతో గడిపే సమయం తక్కువ అయినందుకు వారు బాధపడతారు.

ధనస్సు రాశి : డబ్బును కాలాన్ని వృధాగా ఖర్చు పెట్టే వ్యక్తుల నుంచి దూరంగా ఉందాం అనుకుంటారు. ఇంటిలో దైవసంబంధమైన పూజలు వ్రతాలు చేస్తారు. ఈ కరోనా సమయంలో లేనిపోని అనవసరమైన భయాలను వదిలివేయండి. మీ భయం ఆరోగ్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు.

మకర రాశి : ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఇప్పటి వరకు డబ్బు ఒకటే పరమావధి కాదు అని అనుకునే మీరు డబ్బు సంపాదనలో పడతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ కరోనా సమయంలో ప్రపంచానికి మీ సమస్యలు అవసరంలేదు అని గుర్తుంచుకోండి. ఉద్యోగంలో అందరి మెప్పు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు బంధువులతో చిన్న బేధాభిప్రాయాలు వచ్చినా చివరకు సర్దుకుంటాయి.

కుంభరాశి : ఈ కరోనా సమయంలో నిరాశావాద ధోరణిని పక్కకు పెట్టండి. అది మీ ఆలోచనలనే కాక వ్యక్తులను కూడా మీకు దూరం చేస్తుంది. బంధువులు శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. దుబారా ఖర్చు లకు అవకాశం జాగ్రత్త వహించండి. ప్రయాణాలు కుటుంబ సభ్యుల అనారోగ్యం వల్ల వాయిదా పడే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీరు పడిన శ్రమకు తగిన ఫలితం కనిపించే సమయం.

మీన రాశి : ఆర్థికపరమైన విషయాలలో చిక్కుముడులు తొలగిపోతాయి. నిరాశ, గందరగోళంలను వదిలి ప్రశాంతంగా ఆలోచించండి. పనులలో విజయం సాధిస్తారు. మీ మొండి వైఖరి తల్లిదండ్రులను బాధిస్తుంది. వారితో సానుకూలంగా మాట్లాడి వారి నమ్మకాన్ని పొందండి. నూతన ప్రణాళికలను ఆచరణలో పెట్టబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు అపార్థాలు తొలగించుకొని మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

Advertisement

Next Story

Most Viewed