మైనర్ బాలిక ఘాతుకం.. టాయిలెట్ లో పిండాన్ని ప్రసవించి, ఫ్లష్ చేసి

by Anukaran |   ( Updated:2021-09-05 01:55:47.0  )
మైనర్ బాలిక ఘాతుకం.. టాయిలెట్ లో పిండాన్ని ప్రసవించి, ఫ్లష్ చేసి
X

దిశ, వెబ్‌డెస్క్: కొచ్చిలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక తన కడుపులోని పిండాన్ని వదిలించుకోవడానికి దారుణానికి ఒడిగట్టింది. బాత్ రూమ్ లో నెలలు నిండని పిండాన్ని ప్రసవించి టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసి పరారైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. కొచ్చికి చెందిన ఒక మైనర్ బాలికను ఆరు నెలల క్రితం ఒక 20 ఏళ్ళ యువకుడు రేప్ చేశాడు. ఫలితంగా బాలిక గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికైనా చెపితే చంపేస్తానని యువకుడు బెదిరించడంతో బాలిక మౌనంగా ఉంది. ఈ క్రమంలోనే బాలికను తల్లి బుధవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెకప్ కి తీసుకొచ్చింది.

వారి వంతు కోసం ఎదురుచూస్తుండగా బాలిక బాత్ రూమ్ కి వెళ్లివస్తానని తల్లికి చెప్పి వెళ్ళింది. అక్కడ బలవంతంగా ప్రసవించడానికి ప్రయత్నించింది. దీంతో ఆరునెలల పిండం కదిలి, రక్తస్రావంతో పాటు పిండం కూడా బయటికి వచ్చింది. వచ్చిన పిండాన్ని బాలిక టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసి వెళ్ళిపోయింది. ఆ తరవాత బాత్ రూమ్ కి వెళ్లిన వ్యక్తికి టాయిలెట్ లో పిండం కనిపించడంతో విషయాన్ని వైద్యులకు తెలిపాడు. ఇక ఈ పని చేసింది మైనర్ బాలికగా గుర్తించిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలిక తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను రేప్ చేసిన యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు.

Follow Disha daily Official Facebook page: https://www.facebook.com/dishatelugunews

Advertisement

Next Story