- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పాత్రను ఇతరులు పోషిస్తే ఆనందపడతా : మోహన్ లాల్
దిశ, సినిమా : మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్, మీనా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అదే టైటిల్‌తో పలు భాషల్లో రీమేక్ కాగా, అన్ని చోట్లా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక తెలుగులో విక్టరీ వెంకటేశ్ ఈ రీమేక్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా చాలా కాలం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం2’ను తెరకెక్కించారు మేకర్స్. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఈ నెల 19న డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పోషించిన పాత్రను ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటులు పోషిస్తే తాను చాలా ఆనందపడతానని తెలిపారు.
తను నటించిన చాలా చిత్రాలు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడలో రీమేక్ అయ్యాయని గుర్తుచేసిన లాలెటా.. రీమేకింగ్ అనేది బిగ్ టాస్క్ అని, ఒరిజినల్ ఫిల్మ్‌లోని ఎసెన్స్‌ను తమ భాష, ప్రాంత నేటివిటీకి తగ్గట్లు రూపొందించడం కష్టమని చెప్పారు. ‘దృశ్యం2’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన 4 నెలల తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.