- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూల్స్ బ్రేక్ చేసినా పట్టించుకోలేదు
దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (icc) కొన్ని తాత్కాలిక నిబంధనలు అమలులోనికి తీసుకొని వచ్చింది. ఆటగాళ్లకు కరోనా సోకకుండా బంతిని ఉమ్మితో రుద్దడంపై నిషేధాన్ని విధించారు. ఏ బౌలర్ అయినా బంతిని సెలైవాతో రుద్దితో ముందు హెచ్చరిక జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా అదే పని చేస్తే 5 పరుగులను పెనాల్టీ రూపంలో ఎదుటి జట్టుకు ఇస్తారు. ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య శుక్రవారం మాంచెస్టర్‌లో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
పాకిస్తాన్ జట్టు బౌలింగ్ చేసే సమయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ (Fast bowler Mohammad Amir) బంతిని పలుమార్లు ఉమ్మితో రుద్దాడు. అతడు అలా చేయడం టీవీల్లో పలుమార్లు కనిపించింది. ఎవరైనా అలా చేస్తే అంపైర్లు వారింది టిష్యూతో బంతిని శుభ్రం చేసి ఇవ్వాలి. కానీ ఫీల్డ్ అంపైర్లు అది గమనించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అమీర్‌కు వార్నింగ్ ఇవ్వలేదు, ఎదుటి జట్టుకు పరుగులు ఇవ్వలేదు. కనీసం బంతిని శుభ్రం కూడా చేయలేదు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. కాగా, ఇంగ్లాండ్ జట్టు ముందు బ్యాటింగ్ చేసి 131/6 వద్ద ఉన్నప్పుడు వర్షం పడటంతో తొలి మ్యాచ్ రద్దయ్యింది.