మళ్లీ చాయ్ అమ్ముకుంటానంటున్న ‘మోడీ’ ట్వీట్ వైరల్

by Anukaran |   ( Updated:2021-04-29 02:41:18.0  )
మళ్లీ చాయ్ అమ్ముకుంటానంటున్న ‘మోడీ’ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. వైరస్ కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. కేంద్రం నిర్ణయాల పట్ల సుప్రీం కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. దేశంలో కరోనా పరిస్థితిపై అంతర్జాతీయ మీడియా సైతం.. మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.

సెకండ్ వేవ్ ఎటాక్ చేస్తున్న వేళ ‘మోడీ’ రాజకీయం చేస్తూ.. ప్రజల ఆరోగ్యాలను ఫణంగా పెట్టారని కామెంట్స్ చేస్తూ ప్రముఖ విదేశీ పత్రికలు పలు కథనాలను రాశాయి. కుంభమేళ, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దేశంలో తాజా పరిస్థితికి దోహదం చేశాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మోడీ.. 2014లో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2014లో జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా.. ‘ దేశానికి బలమైన నాయకత్వం కావాలి. ఇక్కడ మోడీ పేరు పెద్ద విషయం కాదు. మోడీ.. వెనక్కి వెళ్లి.. మళ్లీ ఛాయ్ అమ్ముకోవచ్చు. కానీ, దేశం ముఖ్యం అన్ని’ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ ట్వీట్‌కు అనుసంధానంగా పలువురు కామెంట్స్ చేస్తూ.. 2014కి ముందు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. దేశంలో ఇతర పార్టీ నాయకుల పట్ల.. అధికార పార్టీ నేతలకు గౌరవం ఉండేది. బ్యూరోక్రాట్ల ఆధిపత్యం ఉండేది కాదని అంటున్నారు. దేశంలో కరోనా కారణంగా వైద్య సాయం అందకపోవడం, ఆక్సిజన్ లేక పలు ప్రాంతాల్లో ప్రజలు మృతి చెందడం వల్ల నెటిజన్లు సోషల్ మీడియాలో మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో కూడా ‘రిజైన్ మోడీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed