ఎ తో ట్రైలరే..పిక్చర్ అబి బాకీహై

by Shamantha N |
ఎ తో ట్రైలరే..పిక్చర్ అబి బాకీహై
X

బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 8నెలల కాలంలోనే ఎన్నోవిప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని ప్రధాని మోడీ తెలిపారు. ‘టైమ్స్‌నౌ’ నిర్వహించిన ‘ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ 2020’ సదస్సులో ఆయన ఈ విధంగా స్పందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో సెంచరీ స్కోర్‌ సాధించాం. ఊహకందని రీతిలో నిర్ణయాలు తీసుకున్నాం. పని కూడా అంతే వేగంగా చేస్తున్నాం’’ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల్లో కొన్నింటిని ఆయన గుర్తుచేశారు. ‘‘మధ్యతరగతి ప్రజలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాం. బాలలపై వేధింపులను నిరోధించడానికి, చిట్‌ ఫండ్‌ల నియంత్రణకు చట్టాలు తెచ్చాం. ఆర్టికల్‌ 370ను నిర్వీర్యం చేశాం.త్రిపుల్ తలాక్‌ను నిషేధించాం. కార్పొరేట్‌ పన్నుతగ్గించాం. సీడీఎస్‌ పోస్టును సృష్టించాం. యుద్ధ విమానాలు కొనుగోలు చేశాం.రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేశాం. పౌరసత్వ చట్టాన్ని సవరించాం’’ ఇలాంటి నిర్ణయాలు ఎన్నోతీసుకున్నామని గుర్తుచేశారు. ‘‘ఇది కేవలం శాంపిల్‌ మాత్రమేననిి రియల్‌ యాక్షన్‌ ఇప్పుడు మొదలుపెడతామన్నారు. మా ప్రభుత్వ నిర్ణయాలు సెంచరీతో ఆగవు. డబుల్‌ సెంచరీని చేరుకుంటాయన్నారు. దేశం ప్రస్తుతం దశాబ్దపు ప్రణాళికను రచించుకుని, దానికి అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు. పేదలు, రైతుల జీవనప్రమాణ స్థాయిని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు.భారత్ దశాబ్దాల నాటి సమస్యలను అధిగమిస్తూ ముందుకెళుతోంది. అందుకనుగుణంగా అభివృద్ధి కూడా ఎంతో వేగంగా జరుగుతోంది. భారత్‌ తన సమయాన్నిచిన్నచిన్నసమస్యల కోసం వృథా చేసుకోదు, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేందుకు ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed