'అస్సామీలు ఎన్డీయే వైపే'

by Shamantha N |
అస్సామీలు ఎన్డీయే వైపే
X

దిస్పూర్: హింసకు అస్సాం ప్రజలు వ్యతిరేకమని, అభివృద్ది అందజేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం వైపే వారు మొగ్గు చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అస్సాంలోని తమల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ….గడిచిన ఐదేండ్లలో డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెనిఫెట్స్ ఇచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం బీజేపీ పాటు పడుతుంటే కొన్ని పార్టీలు మాత్రం ఓటు బ్యాంకు కోసం దేశాన్ని విడదీస్తున్నాయని తెలిపారు.

అన్ని వర్గాల కోసం పనిచేసే వారిని మతతత్వ పార్టీలనీ .. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారిని సెక్యులర్ అని అంటుడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సాధికారత కల్పించేందుకు సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రంతో తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
రాబోయే కాలంలో గడ్డం, టోపీ, లుంగీ కట్టుకున్న వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ఏఐడీయూసీ నేత అబ్దుల్ రహీమ్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా విరుచుపడ్డారు. అస్సాం గౌరవాన్ని, సమైక్యతను, అస్తిత్వాన్ని అవమానించే వారిని అస్సాం ప్రజలు సహించరని అన్నారు. వారికి అస్సాం ప్రజలు బ్యాలెట్‌తో సరైన సమాధానం ఇస్తారని అన్నారు.

మిలిటెంట్లు లొంగిపోవాలి

అస్సాంలో ఇప్పటి వరకు కొందరు మిలిటెంట్లు లొంగిపోలేదని, వారంతా లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని అన్నారు. ఆత్మ నిర్భర అస్సాం ఏర్పాటులో వారి ఆవకశ్యత ఉన్నందున లొంగిపోయి సహకరించాలని కోరారు.

Advertisement

Next Story