- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్న మోదీ సర్కారు..!
దిశ వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) అనే కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితమైన రాబడి అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పెన్షన్ ఫండ్స్, ఇతర సంస్థలతో చర్చలు జరుపుతున్నామని.. ఈ స్కీమ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఖచ్చితంగా ఎంత వరకు రాబడి అందించొచ్చనే అంశంపై ఫండ్ మేనేజర్లతో చర్చిస్తున్నట్లు బందోపాధ్యాయ చెప్పుకొచ్చారు. ఈ పీఎఫ్ఆర్డీఏ స్కీమ్ ప్రకారం.. సబ్స్క్రైబర్లు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాలి. మూడు నెలలు, ఆరు నెలలకు కూడా డబ్బులు కట్టొచ్చు. ఇలా నిర్ణీత కాలం వరకు చెల్లించిన తర్వాత 60 ఏళ్ల నుంచి పెన్షన్ పొందవచ్చు.