కేసీఆర్‌‌కు మోడీ సమయమిచ్చేనా?

by Shyam |
కేసీఆర్‌‌కు మోడీ సమయమిచ్చేనా?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన‌లో భాగంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ విందుకు 9 మంది ముఖ్యమంత్రులను మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. అందులో ఒకరైన కేసీఆర్ ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. అనంతరం రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోడీతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, మోడీ సమయం ఇస్తారా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరనున్నారు. ట్రంప్‌తో విందు ముగిసిన అనంతరం మోడీతో భేటీ కోసం కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. మంగళవారం మోడీ సమయం దొరక్కపోయినప్పటికీ ఢిల్లీలో రెండు రోజులు ఉండైనా అపాయింట్‌మెంటు సంపాదించి రాష్ర్ట ఆర్ధిక పరిస్థితులపై మోడీతో చర్చించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేయనున్నట్టు తెలుస్తోంది. కానీ, మోడీ కేసీఆర్‌కు సమయం ఇస్తాడా.. లేదా రాష్ర్ట పరిస్థితులు పై మాట్లాడే అవకాశం వస్తుందా.. లేదా అన్న అంశం రాష్ర్టంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed