అయోధ్యకు చేరుకున్న మోడీ.. ఇప్పుడేం చేస్తారు?

by Shamantha N |   ( Updated:2020-08-05 00:48:39.0  )
అయోధ్యకు చేరుకున్న మోడీ.. ఇప్పుడేం చేస్తారు?
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలో అయోధ్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన అయోధ్యకు వచ్చారు. ఉదయం 11.35 గంటలకు అయోధ్యకు చేరుకునున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ఘనస్వాగంత పలికారు. యోగితో కలిసి హనుమాన్ గర్హి ఆలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రంలో ఆయన పాల్గొననున్నారు. 12.40 గంటలకు ప్రధాని పునాది రాయి వేయనున్నారు. అనంతరం 12.45 గంటలకు ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు.

Advertisement

Next Story