షాకింగ్ .. IPOను వాయిదా వేసిన ప్రముఖ సంస్థ

by Harish |
mobikwik
X

దిశ,వెబ్ డెస్క్ : భారతీయ చెల్లింపుల సంస్థ MobiKwik ఐపీఓను వాయిదా వేసింది. స్టాక్ మార్కెట్‌ నష్టాలలో ఉండటం.. Paytm ఐపీవోకు వెళ్లిన ప్రారంభ దశలోనే నష్టాలను మూటగట్టుకోవడం.. ఐపీఓ ధర 40 శాతం వరకు క్షీణతను నమోదు చేయడం వంటి సమీకరణాల వలన Mobikwik ఐపీఓను వాయిదా వేసుకున్నట్లుగా CEO బిపిన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.1,900 కోట్లు సమీకరించాలని కంపెనీ మొదట భావించింది. వీటిలో రూ.1,500 కోట్ల విలువైన కొత్త షేర్లు, ప్రస్తుత వాటాదారుల రూ.400 కోట్ల విలువైన ఆరంభ విలువను విక్రయించనున్నారు.

CEO బిపిన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రూ.1,900 కోట్ల IPO కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి ఆమోదం పొందింది. బజాజ్ ఫైనాన్స్ మద్దతున్న mobikwik తాము విజయవంతమైన IPOని కలిగి ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే తాము ఐపీఓకు వెళ్తామన్నారు.
MobiKwik ద్వారా ప్రతి రోజూ రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం MobiKwik వినియోగదారుల సంఖ్య 1.07 కోట్లకు పైగా చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed