- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఐజీ తెలిపిన వివరాల ప్రకారం…. గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపాల్, హిర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో పోలీసులకు మావోయిస్టులు తారస పడి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో ఒక మావోయిస్టు మృతదేహం, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాగా తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు ఐజీ తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు నడుమ నాలుగు సార్లు ఎదురుకాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. ఆ ఘటనల నుంచి మావోయిస్టులు తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు.