- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ నేర్పిన రాజకీయాన్నే బీజేపీ చేస్తోంది
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కాంగ్రెస్ పార్టీ నేర్పిన రాజకీయాన్నే ఇవాళ బీజేపీ చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఎన్టీఆర్ పాలన వచ్చేవరకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిన కాంగ్రెస్.. ఛలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం అంటూ ఏమీ లేదని, రాష్ట్రానికో విధంగా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాజస్థాన్‌లో ఓ విధానం, తెలంగాణలో మరో విధానంతో పాలిటిక్స్ చేస్తోందని మంగళవారం అసెంబ్లీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.
కరోనా ప్రభావంతో పండుగలను సైతం ప్రజలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ రూల్స్ బ్రేక్ చేస్తుందన్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నేతలు తమకు కరోనా వస్తే ప్రభుత్వంపై అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Advertisement
Next Story