మాటిచ్చి తప్పిన అర్వింద్ : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

by Ramesh Goud |
మాటిచ్చి తప్పిన అర్వింద్ : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
X

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన పసుపు బోర్డు తెస్తానని రైతులకు మాట ఇచ్చి ఎంపీ అయ్యాక అర్వింద్ మాట మార్చారని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డును తీసుకొస్తారనే నమ్మకంతోనే రైతులు అర్వింద్‌ను గెలిపించారే తప్ప సుగంధ ద్రవ్యాల బోర్డు కోసం మాత్రం కాదని అన్నారు. రైతులు ఉద్యమం చేసింది కూడా పసుపు బోర్డు కోసమే కాని వేరే ఇతర బోర్డుల కోసం కాదని గుర్తుచేశారు.మునిసిపల్ ఎన్నికల ముందు పసుపు బోర్డ్ వచ్చిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి తీరా ఇఫ్పుడు స్పైస్ బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎంపీ ఎన్నికలకు ముందు బాండ్ పేపర్ రాసిచ్చి ఎన్నకలయ్యాకా రైతుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. సుగ్రంద ద్రవ్యాల బోర్డుతో పసుపు రైతులకు ఎలాంటి లాభం చేకూరదని, పసుపు బోర్డు మాత్రమే వారి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందన్నారు. బోర్డు తీసుకురావడంలో ఫెయిల్ అయిన అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనియెడల త్వరలోనే పసుపు బోర్డుపై రైతుల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story