సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

by Shyam |   ( Updated:2020-08-30 06:26:57.0  )
సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కెసిఆర్ కు లేఖ రాశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం మంచి ఉద్దేశమే. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి అరకొర సిబ్బందితో క్లాసులు బోధించడం ఇబ్బందికరమని, అందుకోసం విద్యా వాలంటరీ నియామకాలు వెంటనే చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడం, ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయకపోవడం వలన ఇప్పటికే 16 వేల విద్యా వాలంటరీల నియామకంతో బోధన వ్యవస్థ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు తోడు, వివిధ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో బోధన సిబ్బందిని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, గెస్ట్ టీచర్ వ్యవస్థ ద్వారా కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయి బోధన సిబ్బందిని నియామకం చేసినట్లయితే ఆన్ లైన్ బోధన ద్వారా కూడా విద్యార్థులకు ఆశించినంత విద్యా బోధన సదుపాయం అందించిన వాళ్లు అవుతారని సూచించారు. విద్య వాలంటరీలను యధావిధిగా కొనసాగించే విధంగా బోధన సిబ్బందిని తక్షణమే పునర్ నియమించడానికి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Advertisement

Next Story