మద్యం విక్రయంతోనే తెలంగాణ ప్రగతి..

by Shyam |
మద్యం విక్రయంతోనే తెలంగాణ ప్రగతి..
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రగతి మద్యం అమ్మకాలతోనే సాధ్యమవుతోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంగా పేర్కొన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టడం సీఎం కేసీఆర్‌‌‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా సమాధానాలు దాటవేసే ధోరణిలో వ్యవహరిందన్నారు. వచ్చే ఏడాదికీ తెలంగాణ రాష్ట్రం అప్పులు రూ.3,18,805 కోట్లకు చేరుతుందన్నారు. మద్యం విక్రయాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలువడానికి టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చొరవే కారణమన్నారు. మద్యం నిరుపేదల కుటుంబ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని మండిపడ్డారు. ఊరికి 10బెల్ట్ షాపులు వెలిసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఐటీ రంగంలో 75శాతం ఉద్యోగులు తెలంగాణేతరులే ఉన్నారని స్పష్టంచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వ రాయితీ‌తో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 85‌శాతం స్థానికత రిజర్వేషన్లు కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులుగా తయారు చేస్తుందని ఎమ్మెల్సీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

Tags: wines distribution, telangana top in india, cm kcr, mlc jeevan reddy, fires on ts govt

Advertisement

Next Story