కేటీఆర్‌కు 25ఎకరాల ఫాంహౌజ్ ఎందుకు?

by Shyam |
కేటీఆర్‌కు 25ఎకరాల ఫాంహౌజ్ ఎందుకు?
X

ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టుపై ఎమ్మెల్సీ జీవనరెడ్డి తీవ్రంగా స్పందించారు.ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన తీరును ఖండిస్తున్నానని తెలిపారు. శుక్రవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన తండ్రి కేసీఆర్‌‌కు ఎర్రవల్లిలో ఓ ఫాంహౌజ్ ఆయన కొడుకు కేటీఆర్‌కు జన్వాడలో ఫాంహౌజ్ ఎందుకు అని ప్రశ్నించారు.రాష్ట్రంలో 111జివో నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ నాయకులు 25ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ల నిర్మాణం ఎలా చేపట్టారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ తన విలాసవంతమైన జీవనం కోసం 111జీవోను ఉల్లంఘిస్తే తప్పులేదు కానీ, నిజం బయట పెట్టినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్టా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అసలు దొంగలను పట్టుకోవడం మానేసి తెలంగాణ పోలీసులు ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 111జివోను కాపాడాల్సిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ తానే ఉల్లంగిస్తున్నారన్నారు. ఫామ్‌హౌస్ కేటీఆర్ ది కాదని, కొన్నేండ్లుగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే బాల్కాసుమన్ చెప్పిన మాటల్లో నిజం ఎంతుందో నిరూపించాలన్నారు.నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడమే కాకుండా సొంత ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని విమర్శించారు.డ్రోన్ ఎగురవేసిన విషయంలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నా రేవంత్ అరెస్టు న్యాయబద్ధమైనది కాదన్నారు. రాష్ట్రంలో 111జీవోను ఉల్లంఘిస్తూ అనేక నిర్మాణాలు జరుగుతున్నావారిపై మంత్రి కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.111జివో ఉల్లంఘంచిన కేటీఆర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: minister ktr, mlc jeevan reddy, mp revanth reddy, drone camera, 25 acr form house

Advertisement

Next Story

Most Viewed